: ప్రియుడితో కలిసి ఐఎఫ్ఎస్ భర్తను చంపేసిన భార్య అరెస్టు


ప్రియుడి మోజులో పడి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి అయిన భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్టు చేశారు. గత నెల 10న దక్షిణ ఢిల్లీ సుబ్రతొ పార్క్లోని తన నివాసంలో ఉత్తరప్రదేశ్ కు చెందిన 40 ఏళ్ల రమేష్ చంద్ర హత్యకు గురయ్యారు. రమేష్ భార్య సుధ చంద్ర తన టీనేజ్ ప్రేమికుడి (17)తో కలసి ఆయనను హత్య చేసింది. సుధ ప్రేమికుడు మరో ఐఏఎఫ్ అధికారి కుమారుడని, వారి నివాసం రమేష్ చంద్ర నివాసం పక్క పక్కనేనని పోలీసులు తెలిపారు. రమేష్ను వారిద్దరూ హత్య చేసిన తరువాత రమేష్ చంద్ర గుండెపోటుతో మరణించాడని సుధ ఇరుగుపొరుగు వారికి చెప్పింది.

దీంతో నిబంధనల ప్రకారం బాడీని మిలటరీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పోస్టు మార్టం నిర్వహించగా, గొంతునులమడంతో రమేష్ చంద్ర మరణించారని తేలింది. దీంతో సుధ చంద్రను విచారించిన పోలీసులు ఆమె తన ప్రియుడితో కలిసి హత్య చేసినట్టు నిర్ధారించారు. దీంతో సుధ 17 ఏళ్ల ప్రియుడ్ని బాల నేరస్తుల కేంద్రానికి తరలించారు. సుధను రిమాండ్ కు తరలించారు. సుధ, రమేష్ దంపతులకు నాలుగేళ్ల పాప ఉంది.

  • Loading...

More Telugu News