: ఆరుషిపై రూపొందిన సినిమా రిలీజ్ కు బాంబే హైకోర్టు బ్రేక్
‘రహస్య’ సినిమా విడుదలకు బాంబే హైకోర్టు మోకాలడ్డింది. ఆరుషి తల్వార్ హత్యోదంతం ఆధారంగా తెరకెక్కిన హిందీ చిత్రం ‘రహస్య’. జూన్ 13 వరకు ఈ సినిమాను విడుదల చేయవద్దంటూ జస్టిస్ కనాడే, జస్టిస్ అనిల్ మీనన్ లతో కూడిన బెంచ్ ఆదేశాలిచ్చింది. అయితే సినిమా మేకింగ్ ప్రోమోలు ప్రదర్శించకుండా చూడాలన్న అభ్యర్థనను మాత్రం కోర్టు తిరస్కరించింది. ఈ సినిమా విడుదల కాకుండా చూడాలన్న నుపుర్, రాజేష్ తల్వార్ అభ్యర్థన మేరకు కోర్టు ఈ ఆదేశాలిచ్చింది. వేసవి సెలవులు ముగిసిన తర్వాత జూన్ 13న తదుపరి విచారణ జరుపుతామని బెంచ్ పేర్కొంది. సంచలనం రేపిన ఆరుషి తల్వార్ హత్యకేసులో ఆమె తల్లిదండ్రులు దోషులుగా తేలడంతో కోర్టు వారికి జీవితఖైదు విధించిన విషయం విదితమే.