: రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు
గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయని వాతావారణ విభాగం వెల్లడించింది. తాడేపల్లిగూడెంలో 17 సెం.మీ., కాకినాడలో 15 సెం.మీ, నూజివీడులో 14 సెం.మీ, గుడివాడ, రాజమండ్రి, తణుకు, మంగళగిరిలో 11 సెం.మీ, కొయ్యలగూడెం, పాడేరులో 10 సెం.మీ, వర్షపాతం నమోదైంది. విజయవాడ, పెద్దాపురం, నర్సాపురంలో 9 సెం.మీ, పోలవరం, ఎలమంచిలిలో 8 సెం.మీ, ఏలూరు, తుని, నందిగామ, చింతపల్లిలో 7 సెం.మీ, అమలాపురం, భీమవరం, గుంటూరులో6 సెం.మీ. వర్షపాతం నమోదయినట్లు వాతావారణ శాఖాధికారులు తెలిపారు.