: బంగారు తెలంగాణ కేసీఆర్ తోనే సాధ్యం: బాబూమోహన్
బంగారు తెలంగాణ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తోనే సాధ్యమని ఆ పార్టీ నేత బాబూమోహన్ అన్నారు. మెదక్ లో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ పునర్నిర్మాణానికి కేసీఆరే సమర్థుడని తేల్చి చెప్పారు. తెలంగాణలో క్లీన్ స్వీప్ చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తనను ఓడించేందుకు రాజనర్సింహ కోట్లాది రూపాయలు పంచారని, అయినా ఆంధోల్ లో గెలుపు తనదేనని బాబూమోహన్ అన్నారు.