: వారణాసిలో నరేంద్ర మోడీని విజయం వరిస్తుంది: రవిశంకర్ ప్రసాద్
ప్రముఖ పుణ్యక్షేత్రమైన వారణాసిలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ అధికార ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. మోడీకి భారీ మెజారిటీ వస్తుందని, మిగతా అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని ఆయన జోస్యం చెప్పారు.
వారణాసిలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇవాళ నిర్వహించిన రోడ్ షోకు స్పందన అంతంత మాత్రంగానే ఉందని మరో బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ అన్నారు. రోడ్ షోకు వచ్చిన వారిలో ఏ మాత్రం ఉత్సాహం లేదని ఆయన చెప్పారు.