: జగన్ తో ఉన్న చీకటి ఒప్పందాన్ని కేసీఆర్ బయటపెట్టాలి: శ్రవణ్


టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై టీకాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి శ్రవణ్ విరుచుకుపడ్డారు. జగన్ గురించి సర్వే చేయించి చెప్పాల్సిన అవసరం కేసీఆర్ కు ఏమొచ్చిందని ప్రశ్నించారు. కేసీఆర్, జగన్ ల మధ్య ఉన్న చీకటి ఒప్పందాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. జగన్ దోపిడీలో కేసీఆర్ కు భాగస్వామ్యం ఉందా? అని నిలదీశారు. దొంగలకు కేసీఆర్ వత్తాసు పలుకుతున్నారా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు చేజారిపోతారన్న భయంతోనే కేసీఆర్ కాంగ్రెస్ తో దోస్తీకి రెడీ అంటున్నారని ఆరోపించారు. రోజుకో మాట మార్చే కేసీఆర్ ను ఎలా నమ్మాలని ఎద్దేవా చేశారు. సోనియాను కేసీఆర్ ఒకప్పుడు బలిదేవత అన్నారని... ఇప్పుడేమో దేవత అంటున్నారని విమర్శించారు. కృతజ్ఞతకు అర్థం తెలిసిన వారెవరూ కేసీఆర్ లా ప్రవర్తించరని దెప్పిపొడిచారు.

టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాలను కేసీఆర్ చీరి చింతకు కడతానన్నారని... కానీ, క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డ వారిని మాత్రం ఒక్క మాట కూడా అనరని ఆరోపించారు. పొన్నాలను తిట్టినంత మాత్రాన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగిపోతారని కేసీఆర్ భావిస్తున్నట్టున్నారని... వెళ్లి పోవాలనుకునే వారు ఎలాగైనా వెళ్లిపోతారనే విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News