: కాంగ్రెస్ పై పోరాడితే ఎవరైనా సరే జైలుకి వెళ్ళాల్సిందే!: ములాయం సింగ్
యూపీఏ ప్రభుత్వానికి బయటినుంచి మద్దతు ఇస్తున్న సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కాంగ్రెస్ పై మరోసారి విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాడితే ఇక జైలే దిక్కని అన్నారు. కాంగ్రెస్ ను వ్యతిరేకించి పోరాడడం ఎవరికీ అంత సులభం కాదన్నారు. ఒకవేళ ఎవరైనా అలా చేస్తే వారు కచ్చితంగా సీబీఐ దాడులు ఎదుర్కోవాల్సిందేనన్నారు