: ఛీఛీ...తిట్టుకుంటున్నారు...అబద్దాలు చెబుతున్నారు: వెంకయ్యనాయుడు


కాంగ్రెస్ నేతలు వ్యక్తి గత దూషణలకు దిగుతూ తమ స్థాయిని దిగజారుస్తున్నారని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, సోనియా నుంచి వార్డు స్థాయి కాంగ్రెస్ నేత వరకు అందరూ మోడీపై అసత్యాలు మాట్లాడారని అన్నారు. టెర్రరిస్టులు, నల్లధనం, అవినీతిపరులపై నిఘాపెట్టని కాంగ్రెస్ అధిష్ఠానం మోడీపై నిఘా పెట్టడం దుస్సాహసమని ఆయన అన్నారు.

బీజేపీ 300 స్థానాలకు పైగా గెలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. నీచ రాజకీయాలంటే ఏంటని ఆయన కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. బొగ్గు కుంభకోణమా?, ఆదర్శ కుంభకోణమా?, 2జీ కుంభకోణమా?, చక్కెర కుంభకోణమా? ఏది నీచమైన రాజకీయం? అని ఆయన నిలదీశారు. గుజరాత్ భూ సేకరణ విధానం మంచిదని కేంద్ర ప్రభుత్వ వాణిజ్య, పరిశ్రమల శాఖ సర్టిఫికేట్ ఇచ్చిందని ఆయన తెలిపారు.

అలాంటిది ఎవరి పాలన మీద విమర్శలు చేస్తారని ఆయన ప్రశ్నించారు. అమిత్ షాకు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తాము వేసిన పాచికలు పారక కాంగ్రెస్ నేతలు తమ పరువు తామే తీసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.

  • Loading...

More Telugu News