: మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం... మహిళ గొంతు కోసి నగలు దోచుకున్నారు
మహబూబ్ నగర్ జిల్లా ఫరూక్ నగర్ మండలం రంగంపేటలో గత అర్ధరాత్రి ఘోరం జరిగింది. దొంగలు ఓ ఇంట్లో చోరీకి ప్రయత్నించారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ ప్రతిఘటించడంతో... ఆమె గొంతు కోసి, ఇంట్లోని నగలతో పరారయ్యారు. రక్తపుమడుగులో ఉన్న ఆ మహిళను చూసిన పక్కింటి వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఆమెను షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహిళ పరిస్థితి చాలా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దొంగల కోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు.