: బాలీవుడ్ నటి గుల్ పనాగ్ పై బీజేపీ కార్యకర్తల దాడి


వారణాసిలో ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ శ్రేణులు ప్రత్యర్థుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నాయి. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు, బాలీవుడ్ నటి గుల్ పనాగ్ తో పాటు వీజే రఘురామ్ పై బీజేపీ కార్యకర్తలు దాడికి దిగారు. బెనారస్ హిందూ యూనివర్శిటీ ఐఐటీలో బీజేపీ కార్యకర్తలు తమపై దాడి చేశారని గుల్ పనాగ్, రఘురామ్ ఆరోపించారు. వారణాసిలో ఆమ్ ఆద్మీ అధినేత కేజ్రీవాల్ తరపున గుల్ పనాగ్ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆమె చండీగఢ్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఏఏపీ అభ్యర్థిగా పోటీ చేసిన విషయం విదితమే.

  • Loading...

More Telugu News