: జయ, ములాయం, మమతలు మోడీకి మద్దతు ఇవ్వచ్చు: మాయావతి
ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ఊహించిన ఫలితాలు రాకపోవచ్చన్న విషయం బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీకి అర్థమయిందని బీఎస్పీ అధినేత్రి మాయావతి తెలిపారు. అందుకే ఇతరుల మద్దతు తీసుకునేందుకు మోడీ సిద్ధమయ్యారని చెప్పారు. మోడీకి ములాయం, జయ, మమతలు మద్దతిచ్చే అవకాశాలను కొట్టిపారేయలేమని తెలిపారు. తాము మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏకు మద్దతివ్వమని... బీజేపీ కూటమికి దూరంగా ఉంటామని స్పష్టం చేశారు.