: ప్రపంచంలోని 20 కాలుష్యకారక నగరాల్లో 13 మన దేశంలోనే!


ప్రపంచంలోని 20 కాలుష్యకారక నగరాల్లో 13 మన దేశంలోనే ఉన్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్, చత్తీస్ ఘడ్ రాజధాని రాయపూర్ తదితర నాలుగు నగరాలు విషపూరిత వాయువులకు కేంద్రాలుగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన బులెటిన్ లో వెల్లడించారు. కాలుష్య పరంగా అన్ని విభాగాల్లోనూ ఢిల్లీ అగ్రస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. 2011 నుండి 91 దేశాల్లోని 1600 నగరాల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశీలన జరిపినప్పుడు ఈ విషయం బయటపడింది. ముఖ్యంగా పేద దేశాల్లో మురికివాడల్లో నివసించేవారు కాలుష్య ప్రభావానికి లోనవుతూ క్యాన్సర్, గుండెపోటుతో మరణించారని కూడా ఈ నివేదిక వెల్లడించింది. కాలుష్యం పెరిగిపోయిన ఈ నగరాల్లో తక్షణం నష్ట నివారణ చర్యలు చేపడితే మంచిదని ప్రపంచ ఆరోగ్య సంస్థ గట్టిగా చెబుతోంది.

  • Loading...

More Telugu News