: తెలంగాణ రాష్ట్రానికి 13న కొత్త ఖాతా తెరుస్తున్నారు


కొత్తగా ఏర్పడుతోన్న తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ నెల 13న కొత్త ఖాతా తెరుస్తున్నారు. ముంబైలోని రిజర్వ్ బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో 13న ఖాతాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్, కేంద్రప్రభుత్వం మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరుగుతుందని అధికారులు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం తరపున ఖాతా తెరిచే బాధ్యత ఐఏఎస్ అధికారి ప్రేమ్ చంద్రారెడ్డికి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. జూన్ 2వ తేదీ అపాయింటెడ్ డే సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక ఖాతా తెరువనున్నారు.

  • Loading...

More Telugu News