: ఏపీకి 211... తెలంగాణకి 163


రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యోగుల పంపకాల వ్యవహారం పూర్తికావచ్చింది. రెండు రాష్ట్రాలకు సంబంధించిన పంపకాలను ప్రత్యూష్ సిన్హా కమిటీ పూర్తి చేసింది. ఇప్పటిదాకా ఉన్న సమాచారం ప్రకారం... ఆంధ్రప్రదేశ్‌కు 211 ఐఏఎస్, 144 ఐపీఎస్, 82 ఐఎఫ్ఎస్ పోస్టులను... తెలంగాణకు 163 ఐఏఎస్, 112 ఐపీఎస్, 65 ఐఎఫ్ఎస్ పోస్టులను కేటాయిస్తారు. దీంతో ఉద్యోగుల విభజనలో మొదటి అంకం ముగిసినట్టైంది.

అఖిల భారత సర్వీసు అధికారుల పంపిణీ కసరత్తు పూర్తవడంతో, ప్రత్యూష్ సిన్హా కమిటీ తన నివేదికను కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ (డీవోపీటీ)కి అందజేసింది. ఇక ఉద్యోగుల పంపకం మాత్రమే మిగిలి ఉంది. అది కూడా ఇంచుమించు పూర్తయినట్టు సమాచారం. దీనిపై కమలనాథన్ కమిటీ పని చేస్తోన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News