: బెంగాల్ శారద చిట్ ఫండ్ స్కాంలో సీబీఐ విచారణకు ఆదేశం
పశ్చిమ బెంగాల్లో జరిగిన శారద చిట్ ఫండ్ స్కాంలో సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ఈ రోజు ఆదేశించింది. చిట్ ఫండ్ లో పొదుపు చేసిన బెంగాల్, ఒడిషా, త్రిపుర, జార్ఖండ్, అస్సాం మదుపుదారులు నష్టపోయారు. గతేడాది ఏప్రిల్లో మొత్తం రూ.2,500 కోట్ల స్కాం జరిగినట్టు బయటపడింది. ఆ వెంటనే కంపెనీ ఛైర్మన్ సుదీప్త సేన్ ను అరెస్టు చేశారు. కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించడంతో ప్రస్తుతం కోల్ కత జైలులో ఉన్నారు. ఇదే స్కాంలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కునాల్ ఘోష్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే, ఈ స్కాంలో విచారణను మమత ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది.