: ఎన్నికలకు సిద్ధంగా ఉండండి : కార్యకర్తలకు బాబు పిలుపు
రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు ఎప్పుడొచ్చినా వాటిని ఎదుర్కొనేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. తన శ్రేణులను అప్రమత్తం చేస్తోంది. అందుకు తగ్గట్టుగానే, 'ఎన్నికలు ఎప్పుడొచ్చినా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని' ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ఎన్నికల సమయానికి పరిస్థితులు భిన్నంగా ఉన్నా, తప్పకుండా విజయం పార్టీదే కావాలని చెప్పారు.
తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు 'వస్తున్నా మీకోసం' పాదయాత్ర సాగుతోంది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు టీడీపీ శ్రేణులు నిరంతరం అవినీతిపైనే పోరాడాలని సూచించారు. పార్టీపై కాంగ్రెస్, వైఎస్ ఆర్ కాంగ్రెస్ ల చెడు ప్రచారానికి దీటుగా స్పందించాలన్నారు.