: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం మంజూరు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఫించనుదారులకు కరవు భత్యం (డీఏ) మంజూరైంది. పెరిగిన డీఏ ఈ ఏడాది జనవరి నుంచి వర్తిస్తుంది. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో... ఉద్యోగులకు కరవు భత్యం చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం ఎన్నికల అధికారుల నుంచి ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సి వచ్చింది. డీఏ చెల్లింపులకు సీఈవో భన్వర్ లాల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇవాళ లేదా రేపు దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ కానున్నాయి. ప్రస్తుతం 63.34 శాతంగా ఉన్న కరవు భత్యం... తాజా ఉత్తర్వులతో 8.56 శాతం పెంపుతో 71.90 శాతానికి చేరింది. అయితే జనవరి నుంచి ఏప్రిల్ వరకు డీఏ బకాయిలను జీపీఎఫ్ ఖాతాల్లోకి మళ్లించనున్నట్లు ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి.