: సీమాంధ్ర ఉద్యోగులను తెలంగాణలో ఉంచొద్దు: శ్రీనివాస్ గౌడ్


సీమాంధ్ర ఉద్యోగులను సొంత రాష్ట్రానికి పంపాలని టీఎన్జీవో నేత శ్రీనివాస్ గౌడ్ కేంద్రాన్ని కోరారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఖాళీలు లేవనే నెపంతో సీమాంధ్ర ఉద్యోగులను తెలంగాణలో ఉంచొద్దని అన్నారు. సీమాంధ్ర ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వొద్దని కేంద్రానికి విజ్ఞప్తి చేశామన్నారు. స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన ఉండాలని సూచించినట్టు ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News