: ఢిల్లీలో సమావేశమైన కమలనాథన్ కమిటీ
ఢిల్లీలోని కేంద్ర హోంశాఖ కార్యాలయంలో కమలనాథన్ కమిటీ సమావేశమైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి, ఉన్నతాధికారులు ఈ కీలక సమావేశానికి హాజరయ్యారు. విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల విభజనపై మార్గదర్శకాలను కమలనాథన్ కమిటీ ఇవాళ ఖరారు చేయనుంది. ఈ ఉదయం ప్రత్యూష్ సిన్హా కమిటీతో పీకే మహంతి భేటీ అయ్యారు. ఉద్యోగులకు ఎక్కడ పనిచేయాలన్న దానిపై ఆప్షన్ ఇవ్వాలా? వద్దా? అనే దానిపై కీలక నిర్ణయం తీసుకోనుంది. అయితే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులకు ఆప్షన్ ఇవ్వరాదని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది.