: హైదరాబాదులో వర్షపు జల్లులు
హైదరాబాదు నగరం అకాల వర్షపు జల్లులతో తడిసి ముద్దయింది. గురువారం రాత్రి నగరంలో జల్లులు పడ్డాయి. తిరిగి ఈ తెల్లవారుఝాము నుంచి వర్షం కురుస్తుండడంతో నగరం శీతాకాలంలో వర్షాకాలాన్ని చవిచూసింది. సికింద్రాబాదు, అమీర్ పేట, అబిడ్స్, లక్డీకాపూల్, కూకట్ పల్లి తదితర ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. ఈ అనుకోని వర్షపు అతిథితో ఉదయాన్నే వాకింగుకు వెళ్ళే నగరవాసులకు ఆటవిడుపు అయ్యింది.