: పదవులను జీవన్మరణ సమస్యగా మార్చేశారు: జేపీ


రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం లోక్ సత్తా జాతీయ నేత జయప్రకాశ్ నారాయణ మీడియాతో మాట్లాడారు. రాజకీయ పదవులను నాయకులు జీవన్మరణ సమస్యగా మార్చేశారని అన్నారు. పదవుల కోసం ఉన్మాద దశకు చేరుకున్నారని మండిపడ్డారు. అందుకోసం రాజకీయ పార్టీలు ఈ ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు ఖర్చుపెట్టాయన్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేపీ మాట్లాడుతూ, ఎన్నికల్లో దాదాపు పార్టీలు రూ.8వేల కోట్లు ఖర్చుపెట్టాయని ఆరోపించారు. ఇక జిల్లా పరిషత్ సభ్యత్వం కోసం రూ.7 కోట్లు ఖర్చు పెడుతున్నారని చెప్పారు. దీన్ని బట్టి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. అటు ఉద్యోగులు పోలింగులో ప్రభుత్వ విధులనే విస్మరించారన్నారు. ఆంధ్రప్రదేశ్ లో సుమారు 12వేల కోట్ల రెవెన్యూ లోటు ఉందని, దాంతోనే రాష్ట్రం మొదలవుతుందని జేపీ చెప్పారు.

  • Loading...

More Telugu News