: మాక్స్ వెల్ కు ధోనీ ప్రశంస!
ఐపీఎల్ 7వ సీజన్ లో విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగుతున్న ఆస్ట్రేలియన్ ఆటగాడు గ్లెన్ మాక్స్ వెల్ ను టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రశంసలతో ముంచెత్తాడు. దిగ్గజ బ్యాట్స్ మెన్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ ల మాదిరి విభిన్నమైన ప్రతిభ మాక్స్ వెల్లోనూ ఉందని ప్రశంసించాడు. అతని బ్యాటింగ్ అనూహ్యంగా ఉందని, అదే సమయంలో తోటి బ్యాట్స్ మెన్ కు మద్దతిచ్చాడని పేర్కొన్నాడు. సిక్సులు బాదే విషయంలో మరింత సీరియస్ నెస్ అవసరమని మాక్స్ కు ధోనీ సూచించాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య నిన్న సాయంత్రం జరిగిన మ్యాచ్ లో 38 బంతుల్లో 90 పరుగులు చేసిన మాక్స్... జట్టుకు భారీ విజయాన్ని అందించాడు. ఈ పరంపరలో ఎనిమిది సిక్సులు, ఆరు ఫోర్లుతో మెరుపు బ్యాటింగ్ చేసి ఆకట్టుకున్నాడు.