: మోడీ బహిరంగ చర్చకు రా: కేజ్రీవాల్
బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని బహిరంగ చర్చకు రావాలంటూ ఆప్ లోక్ సభ అభ్యర్థి అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్ లో ఆహ్వానించారు. అప్పుడు కాశీ ప్రజలు ఇద్దరినీ డైరెక్ట్ గా ప్రశ్నలు అడుగుతారన్నారు. అయితే, ఏ టైమ్ లో అనేది ఆయనే నిర్ణయించవచ్చని కేజ్రీ అన్నారు. వారణాసిలో మోడీ సభకు ఎన్నికల సంఘం అనుమతి నిరాకరణపై అంతకుముందు స్పందించిన కేజ్రీ, అక్కడ 'గంగా ఆరతి' ఇచ్చేందుకు మోడీకి అనుమతించారని... కానీ, పోలిటికల్ మైలేజ్ ను సాధించేందుకు ఆయన చూస్తున్నారని ఆరోపించారు. వారణాసి లోక్ సభ స్థానానికి మోడీ, కేజ్రీ పోటీ చేస్తుండగా ఈ నెల 12న పోలింగ్ జరగనుంది.