: బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఎదుట బీజేపీ కార్యకర్తల నిరసన
బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ర్యాలీకి వారణాసిలో ఎన్నికల సంఘం అనుమతి తిరస్కరించిన సంగతి తెలిసిందే. దాంతో, ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ పార్టీ కార్యకర్తలు కాశీలో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. మోడీ సభకు అనుమతి ఇవ్వాలంటూ ఆందోళన చేస్తున్నారు. ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు.