: థర్డ్ ఫ్రంటే లక్ష్యం... సోనియా, మోడీలు ఎవరిక్కావాలి?: షర్మిల
సీమాంధ్రలో వైఎస్సార్సీపీది ఏక పక్ష విజయమని ఆ పార్టీ నేత షర్మిల అన్నారు. కడపలో ఆమె మాట్లాడుతూ, 140 అసెంబ్లీ స్థానాలను వైఎస్సార్సీపీ గెలుచుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే 25 ఎంపీ స్థానాలు తమ పార్టీ గెలుచుకుంటుందని ఆమె స్పష్టం చేశారు. సోనియా గాంధీ, నరేంద్ర మోడీలు తమకు అవసరం లేదని అన్నారు. తాము థర్డ్ ఫ్రంట్ కు అనుకూలమని స్పష్టం చేశారు. ముందుగా థర్డ్ ఫ్రంట్ కు మద్దతు ఇస్తామని ఆమె వెల్లడించారు. రాష్ట్రానికి రాజధాని లేదని, నగరాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని షర్మిల తెలిపారు.