: పాక్ రాజధాని నడిబొడ్డున బిన్ లాడెన్ లైబ్రరీ
ఒసామాబిన్ లాడెన్ పై ప్రేమను పాకిస్థాన్ బయటపెట్టింది. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ నగరం నడిబొడ్డున ఉండే లాల్ మసీదులోని గ్రంధాలయానికి అల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామాబిన్ లాడెన్ పేరుపెట్టారు. మత గురువు మౌలానా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, ఈ లైబ్రరీ ద్వారా 5 వేల మంది విద్యార్థులకు లబ్ది చేకూరనుందని అన్నారు. ఇంత మంది విద్యార్థులకు లబ్ది చేకూర్చిన లాడెన్ కు నివాళులర్పిస్తామని ఆయన చెప్పారు. 2007లో పాక్ అధ్యక్షుడిగా ముషారఫ్ ఉన్న సమయంలో, లాల్ మసీదులో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో సైనికులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 100కి పైగా ఉగ్రవాదులు మరణించిన సంగతి తెలిసిందే.