: విశాఖ జిల్లాలో ఈవీఎంలు, జీపును దగ్ధం చేసిన మావోయిస్టులు
ఈ రోజు సీమాంధ్రలో జరుగుతున్న ఎన్నికల్లో మావోయిస్టులు కూడా తమ ఉనికిని చాటుకున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయనుకుంటున్న తరుణంలో... మావోలు పంజా విసిరారు. విశాఖ జిల్లా కొయ్యూరు మండలం పలకజీడి పోలింగ్ కేంద్రంపై దాడిచేశారు. ఒక అసెంబ్లీ, ఒక లోక్ సభ ఈవీఎంలను బయటకు తీసుకొచ్చి తగలబెట్టారు. దీనికితోడు, ఒక పోలీస్ జీపు (కమాండర్)ను కూడా దగ్ధం చేశారు. దాడి చేసిన వారిలో ఐదుగురు పురుషులు, ఒక మహిళ ఉన్నారు.