: యుద్ధనపూడిలో వైఎస్సార్సీపీ, టీడీపీ రాళ్ల దాడి
ప్రకాశం జిల్లా యుద్ధనపూడి మండలం తోటవారిపాలెంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. టీడీపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఒకరి తప్పులను మరొకరు ఎత్తి చూపుకుంటూ వాగ్వాదానికి దిగారు. అది పెరగడంతో ఇరు వర్గాలు రాళ్ల దాడులకు దిగాయి. ఒక వర్గంపై మరొకరు రాళ్లు రువ్వుకోవడంతో పలువురు గాయపడ్డారు. పోలీసులు రంగప్రవేశం చేసి నలుగురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు.