: వృద్ధిరేటు తగ్గడంపై ప్రధాని నిరాశ


దేశ వృద్ధిరేటు 5 శాతానికి తగ్గడం నిరాశ కలిగిస్తోందని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అన్నారు. అయితే మళ్లీ 8 శాతం వృద్ధిరేటు లక్ష్యాన్ని చేరుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలో రెండు రోజుల పాటు జరగనున్న సీఐఐ సదస్సును ప్రధాని ప్రారంభించారు. అనంతరం ప్రసంగించిన మన్మోహన్.. ప్రపంచ దేశాల ఆర్ధిక పరిస్థితులవల్ల భారత్ తాత్కాలిక మందగమనాన్ని ఎదుర్కోవలసి వస్తోందన్నారు.

ఆర్ధిక మందగనం నుంచి బయటపడేందుకు సరైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా,  ఎగుమతుల తగ్గుదల, కరెంటు ఖాతా లోటు అంగీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ద్రవ్యలోటును అధిగమించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ప్రధాని వెల్లడించారు. 

  • Loading...

More Telugu News