: ప్రతిఘటిస్తే పరిస్థితి అదుపుతప్పుతుందని ఆలోచిస్తున్నాం: నవీన్ చంద్
ఐపీఎస్ అధికారిపై దాడిని ఖండిస్తున్నామని ఐజీ నవీన్ చంద్ తెలిపారు. కడప జిల్లా జమ్మలమడుగులో ఆయన మాట్లాడుతూ, దాడి చేసిన వారిని గుర్తిస్తామని, వారిని వదిలిపెట్టే ప్రసక్తేలేదని తెలిపారు. పార్టీల కార్యకర్తలను ప్రతిఘటిస్తే పరిస్థితి అదుపు తప్పుతుందని ఆలోచిస్తున్నామన్న ఆయన, తమ ప్రధాన లక్ష్యం శాంతిభద్రతల పరిరక్షణే అని స్పష్టం చేశారు.