: వైఎస్సార్సీపీ రౌడీయిజానికి పాల్పడుతోంది: గల్లా అరుణ


సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తీరు సరిగాలేదని మాజీ మంత్రి గల్లా అరుణ తెలిపారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఆమె మాట్లాడుతూ, ఎన్నికల సందర్భంగా పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంటే, వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే మరెంత అరాచకం రాజ్యమేలుతుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. రౌడీలను రంగంలోకి దింపి పోలింగ్ కేంద్రాల్లో పీవోలపై దాడులకు పాల్పడుతూ, మీడియాను గాయాలపాలు చేస్తూ వైఎస్సార్సీపీ అక్రమాలకు పాల్పడుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు భద్రత కల్పించాలని కోరినా అధికారులు పట్టించుకోలేదని గల్లా అరుణ తెలిపారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు స్థానిక మహిళలను తరమడం, కార్యకర్తలను కొట్టడం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.

  • Loading...

More Telugu News