: 9 గం. వరకు చిత్తూరులో 21 శాతం, తూర్పుగోదావరిలో 11 శాతం ఓటింగ్: భన్వర్ లాల్


సీమాంధ్రలోని 13 జిల్లాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని... అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు జరిగాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్ లాల్ తెలిపారు. 10 జిల్లాల్లోని ఈవీఎంలన్నీ బాగా పనిచేస్తున్నాయని... 3 జిల్లాల్లోని కొన్ని ఈవీఎంలు (ఈసీఐఎల్ తయారీ) మాత్రం మొరాయిస్తున్నాయని తెలిపారు. పనిచేయని ఈవీఎంలను మార్చి వేశామని చెప్పారు. ఓటు వేయడానికి వస్తున్న ఓటర్లందరికీ అన్ని వసతులు ఏర్పాటు చేశామని అన్నారు. ఉదయం 9 గంటల వరకు నమోదైన పోలింగ్ విషయానికి వస్తే... చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 21 శాతం, తూర్పుగోదావరి జిల్లాలో అత్యల్పంగా 11 శాతం నమోదయిందని తెలిపారు. ఎండ తక్కువగా ఉన్నందున పోలింగ్ మరింతగా పెరుగుతుందని చెప్పారు.

  • Loading...

More Telugu News