: ఆంధ్రా, తెలంగాణ భవనాల విభజనకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్
ఆంధ్రా, తెలంగాణ భవనాల విభజనకు గవర్నర్ నరసింహన్ ఆమోదం తెలిపారు. హైదరాబాదులోని సచివాలయం, సీఎం క్యాంప్ ఆఫీసు, అసెంబ్లీ, శాసన మండలిలను రెండు రాష్ట్రాలకు అనువుగా ఉండే విధంగా విభజించేందుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రెండు రాష్ట్రాలకు పదేళ్ల పాటు హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉండటంతో పరిపాలన సౌలభ్యం కోసం ఈ విభజనను చేపట్టారు. అలాగే ఢిల్లీలోని ఏపీ భవన్ ను కూడా రెండు రాష్ట్రాలకు కేటాయిస్తున్నారు.