: సాక్షి పత్రికలో డబ్బు పెట్టి పంచుతున్నారు: నామా


వైఎస్సార్సీపీ నేతలు సాక్షి పత్రికలో డబ్బు పెట్టి వాటిని పంచుతున్నారని టీడీపీ నేత నామా నాగేశ్వరరావు జాతీయ ఎన్నికల సంఘానికి తెలిపామని తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, సీమాంధ్రలో వైఎస్సార్సీపీ సర్కారు వస్తోందంటూ మాజీ డీజీపీ భయపెడుతున్నారని అన్నారు. అందుకే సీమాంధ్రలో ఎన్నికల పర్యవేక్షకులుగా ప్రత్యేక అధికారులను నియమించాలని ఈసీని కోరారు. రాయలసీమలో కొన్ని చోట్ల వైఎస్సార్సీపీ రిగ్గింగ్ కు పాల్పడనుందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News