: ప్రియాంక వ్యాఖ్యలపై క్షమాపణ కోరిన బీజేపీ


'నీఛ్ రాజనీతి' (లో లెవల్ రాజకీయాలు) చేస్తున్నారంటూ నరేంద్రమోడీపై తీవ్ర ఆరోపణలు చేసిన ప్రియాంకా గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. అయితే, ప్రియాంకా పేరును ఎత్తకుండా ఆ పార్టీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ ఈ విషయాన్ని డిమాండ్ చేశారు. 'నీఛ్' అంటూ మోడీని వ్యాఖ్యానించి వెనుకబడిన కులాలుగా పేర్కొన్నటం సరికాదన్నారు. ఎవరిపైనా ఎవరూ ఆ పదాన్ని ఉపయోగించకూడదని అన్నారు. అందుకని ఆ పదం ఉపయోగించిన సదరు వ్యక్తి తప్పకుండా జాతికి, ఏ వ్యక్తిపై వాడారో అతనికి క్షమాపణ చెప్పాలని జైట్లీ అన్నారు.

  • Loading...

More Telugu News