: తాలిబన్ల కంటే మన పోలీసులు దారుణం: పూనమ్ పాండే


రెండు రోజుల కిందట పోలీసులు తనను అరెస్టు చేసి వార్నింగ్ ఇవ్వడంతో హాట్ మోడల్, నటి పూనమ్ పాండే మండిపడుతోంది. తాలిబన్ల కంటే పోలీసులు చాలా దారుణమని ఆరోపిస్తోంది. ఆ రోజు పదిన్నర సమయంలో తను, తన అన్నయ్య ఆదిత్య పాండేతో కారులో ఉన్నానంది. మెట్రో పాలిటన్ నగరాల్లో అదేమంత లేటు కాదని చెప్పింది. అంతేకాక తానెలాంటి అసభ్యకర ప్రవర్తన చేయలేదని, డ్రింక్ కూడా చేయలేదని పూనమ్ అంటోంది. మొదట తనను గుర్తించని పోలీసులు పేరు చెప్పాక బాగా కోపగించుకున్నారంది. తనను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి ప్రశ్నించి ఆ తర్వాత వదిలిపెట్టారంది. మూడు రోజుల కిందట (శనివారం) ముంబయిలోని మీరా రోడ్ లో రహదారిపై అసభ్యకరంగా ప్రవర్తిస్తోందంటూ పూనం పాండేను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News