: అల్ప పీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు పడొచ్చు
కన్యాకుమారి సమీపంలో అల్పపీడన ద్రోణి ఏర్పడినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ద్రోణి బుధవారానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో వచ్చే నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.