: అమిత్ షా ఓ టెర్రరిస్టు: లాలూ
బీజేపీ నేత, నరేంద్ర మోడీ సన్నిహితుడు అమిత్ షా ఓ టెర్రరిస్టు అని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యానించారు. నరేంద్ర మోడీకి ఆయన కుడి భుజంలాంటి వాడని అన్నారు. గుజరాత్, ముజఫర్ నగర్ అల్లర్ల వెనుక షా హస్తం ఉందని ఆరోపించారు. ఇలాంటి వారు మత హింసతో దేశాన్ని నాశనం చేస్తారని లాలూ విమర్శించారు. కొన్ని రోజుల కిందట అమిత్ షా మాట్లాడుతూ, ఉత్తరప్రదేశ్ లోని అజమ్ ఘర్ తీవ్రవాదులకు బేస్ అని వ్యాఖ్యానించారు. ఈ మాటల నేపథ్యంలో మండిపడ్డ లాలూ... షానే ఓ తీవ్రవాదని వ్యాఖ్యానించారు.