: ఉత్తర థాయ్ లాండ్ ను వణికించిన భూకంపం


థాయ్ లాండ్ లోని ఉత్తర భాగాన్ని భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైన ఈ భూకంప తీవ్రతకు రోడ్లు చీలిపోయాయి, కిటికీలు, గోడలు బద్దలయ్యాయి. బౌద్ధ ఆలయాలు కూడా దెబ్బతిన్నాయి. చియాంగ్ రాయ్ సిటీలోని విమానాశ్రయాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు. ఎయిర్ పోర్ట్ సీలింగ్ కుప్పకూలినప్పటికీ, రన్ వే మాత్రం డ్యామేజ్ కాలేదు. దీంతో, విమాన రాకపోకలకు అంతరాయం కలగలేదు. నష్ట తీవ్రత ఎంతనే వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News