: బ్రిటిష్ కుక్క అరుదైన ప్రపంచ రికార్డు
ఇంగ్లండ్లోని లాబ్రడార్ జాతికి చెందిన కాలీ అనే కుక్క అరుదైన ప్రపంచ రికార్డు సాధించింది. 250 గంటలకు పైగా విమానంలో ప్రయాణించి, క్రూ కార్డు పొందిన మొట్టమొదటి శునకంగా పేరొందింది. విమానాల యజమానులు, పైలట్ల సంఘం కాలీకి ఈ గుర్తింపునిచ్చింది. కాలీ తన యజమాని గ్రాహమ్ మౌంట్ఫోర్డ్తో కలిసి బ్రిటన్ మొత్తాన్ని గగన వీధుల్లోంచి చుట్టేసింది. కాలీకి 12 వారాల వయసు నుంచి మౌంట్ఫోర్డ్ విమాన ప్రయాణాలు అలవాటు చేశారు.
దీంతో అది చిన్న చిన్న ఎయిర్స్ట్రిప్లతో ఆరంభించి అంతర్జాతీయ విమానాశ్రయాలు చాలా వాటిల్లో ఇది ల్యాండ్ అయింది. ఇప్పుడు కాలీకి క్రూకార్డు రావడంతో, కేవలం విమాన సిబ్బంది మాత్రమే తిరిగేందుకు అవకాశమున్న ప్రాంతాల్లో కూడా తిరిగేందుకు అనుమతి లభించినట్లయింది. బ్రిటన్లో ఈ హోదా పొందిన ఏకైక శునకంగా కాలీ గుర్తింపు పొందింది. దీంతో ఇకపై మౌంట్ఫోర్డ్కు సొంతంగా ఉన్న ఆరు సీట్ల సెస్నా విమానంలోని కో పైలట్ కుర్చీలో కూడా దీన్ని కూర్చోబెట్టవచ్చు.