: అమేధీలో రాహుల్ పై మరో గాంధీ పోటీ


ఉత్తరప్రదేశ్ లో రేపు పోలింగ్ జరగనున్న అమేధీ స్థానంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కఠినమైన పోటీ ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఆయనకు ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కుమార్ విశ్వాస్, బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ గట్టి పోటీనిస్తున్నారు. ఒక హిజ్రా సహా మొత్తం 34 మంది ఇక్కడ గెలుపు కోసం పోటీలో ఉన్నారు. ముఖ్యంగా రాహల్ గాంధీకి మరో గాంధీ నుంచి పోటీ నెలకొంది. 51ఏళ్ల గోపాల్ స్వరూప్ గాంధీ కూడా ఇక్కడ నుంచి ఎన్నికల బరిలో ఉన్నారు. కిసాన్ మజ్దూర్ బెరోజ్ గార్ సంఘ్ తరపున ఆయన పోటీ చేస్తున్నారు. పేరులో గాంధీ ఉంది కానీ, గాంధీల కుటుంబంతో ఈయనకు ఏ మాత్రం సంబంధం లేదండోయ్.

  • Loading...

More Telugu News