: పోటీ నుంచి తప్పుకోనున్న సబ్బం హరి?
జై సమైక్యాంధ్ర పార్టీ కీలక నేత, ఆ పార్టీ విశాఖ లోక్ సభ ఎంపీ అభ్యర్థి సబ్బం హరి ఎన్నికల బరి నుంచి తప్పుకోనున్నట్టు విశ్వసనీయ సమాచారం. కాసేపట్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో తాను ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్న విషయాన్ని ప్రకటిస్తారని తెలుస్తోంది.