: కురచ దుస్తులు చూసి బెదిరిపోతున్న భామలు
కాథ్ వే పసిఫిక్ ఎయిర్ వేస్ విమానాల్లో మహిళా అటెండెంట్లు తమ యూనిఫాంను చూసి బెంబేలెత్తిపోతున్నారు. అవి చాలా కురచగా, టైట్ గా ఉంటున్నాయట. దీని వల్ల పని చేసేటప్పుడు చాలా అసౌకర్యంగా ఉంటోందని వారు మొత్తుకుంటున్నారు. పైగా ఇంత కురచ దుస్తులు వేస్తే తమపై లైంగిక దాడులు జరిగే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. పైన జాకెట్ పొట్టిగా ఉండడంతో వంగినప్పుడు పొట్ట భాగం కనిపిస్తోందని వారు ఫిర్యాదు చేస్తున్నారు. ప్రస్తుతమున్న యూనిఫాంను 2011లో ప్రవేశపెట్టారు. ఈ ఇబ్బందుల నేపథ్యంలో దాన్ని మార్చాలని సౌకర్యంగా ఉండేలా, పొడవుగా తీసుకురావాలని పసిఫిక్ ఎయిర్ వేస్ ఫ్లయిట్ అటెండెంట్స్ యూనియన్ వైస్ చైర్మన్ జూలియన్ యూ డిమాండ్ చేస్తున్నారు.