: మరణించిన వారిని వెతికేందుకెళ్లి శవమయ్యాడు
గత నెల 16న దక్షిణ కొరియా నౌక ప్రమాదంలో గల్లంతైన వారికోసం వెతుకులాట ప్రారంభించిన బృందంలోని గజ ఈతగాడు మృత్యువాత పడ్డాడు. గాలింపు చర్యల్లో భాగంగా సముద్రపు లోతట్టు ప్రాంతానికి వెళ్లడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని టాస్క్ ఫోర్స్ ప్రతినిధి కో మ్యుంగ్ వెల్లడించారు. ఈ ప్రమాదంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన 19 మంది నౌక సిబ్బందిని అరెస్టు చేశామని ఆయన తెలిపారు.