: తండ్రిని దారుణంగా హతమార్చిన కూతురు


తల్లి మూడేళ్ల క్రితం కన్నుమూసింది. ముగ్గురు కూతుర్లు. ఇద్దరు పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిపోయారు. మిగిలింది ఒకే కూతురు. దాంతో తండ్రి (56)లో రాక్షసత్వం నిద్రలేచింది. కూతురిని లైంగికంగా వేధించుకుతింటున్నాడు. భరించింది. ఓపిక పట్టింది. బాధను దిగమింగుకుంది. ఇక చివరికి చేసేదేమీ లేక స్నేహితుల సాయంతో తండ్రి చాప్టర్ ను క్లోజ్ చేసేసింది. దేశ రాజధాని ఢిల్లీలో ఇది జరిగింది. రాజౌరీ గార్డెన్ లో తండ్రితో కలసి ఉంటున్న ఆమె హత్య కోసం ఇద్దరు స్నేహితుల సాయం తీసుకుంది.

ఓ రోజు రాత్రి సమయంలో ఇంటి తలుపు తీయగా ఇద్దరు స్నేహితులు లోపలికి ప్రవేశించారు. వారు రావడంతోనే ఆమె తండ్రి తలపై 20 సార్లు గట్టిగా కొట్టారు. తర్వాత అతడి చేతులు, కాళ్లు కేబుల్ వైర్ తో కట్టేశారు. అప్పుడు తండ్రిపై తీవ్ర కోపంతో ఉన్న బాధితురాలు గాజుపెంకుతో అతడి గుండెను కోసేసింది. లోపల వైద్యులు అమర్చిన పేస్ మేకర్ సెట్ ను బయటకు తీసేసింది. దాంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత శవాన్ని ఇన్నోవాలో తీసుకెళ్లి దగ్గర్లోని కాల్వలో పడేశారు. పోలీసుల విచారణలో వీరి నేరం వెల్లడి కావడంతో ఆమెతోపాటు స్నేహితులిద్దరినీ అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News