: ఇది నిజమైతే.. మార్స్‌పై మనం కాపురాలు చేయొచ్చు!
క్యూరియాసిటీ మనకో అద్భుతమైన విషయాన్ని తెలియజేసింది. క్యూరియాసిటీ అంటే అదేనండీ బాబూ.. నాసా వారు అంగారక గ్రహంపై పరిశోధనల నిమిత్తం పంపిన రోవర్. ఆ గ్రహం మీద పర్క్లోరేట్స్ అనే తరహా లవణాలు పుష్కలంగా ఉన్నట్లుగా రోవర్ క్యూరియాసిటీ గుర్తించింది. అక్కడి సూక్ష్మజీవులకు వాటి ద్వారానే శక్తి అందుతుండవచ్చునని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు.
గ్రహం అంతటా ఇలాంటి లవణాలు ఉండే అవకాశం ఉన్నదని... భవిష్యత్తులో మార్స్‌పై మనిషి జీవనం ఏర్పాటు చేసుకోగలడనే ఆలోచనకు ఇది మంచి సంకేతం అని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. సో, రియల్ ఎస్టేట్ ప్రముఖులూ వింటున్నారా... మార్స్‌పై స్థలాన్ని ప్లాట్లుగా విభజించి అమ్మకాలు మొదలు పెట్టేయండిక.. అక్కడ పరిశోధనలు పూర్తయ్యేలోగా కాస్త మార్కెట్ కూడా బూమ్‌లోకి రావొచ్చు.