: సిక్కుల మనోభావాలను గాయపరిచారంటూ రాందేవ్ పై కేసు


సిక్కు మతస్తుల మనోభావాలను దెబ్బతీశారంటూ యోగా గురువు రాందేవ్ బాబాపై పంజాబ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 295 ఏ కింద జలంధర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. 'తల్వండి సబో'లో నిర్వహించిన యోగా క్యాంప్ లో సిక్కుల పదవ గురువు గురు గోవింద్ సింగ్ ఫొటోను రాందేవ్ చూపించారని, తర్వాత ఆ ఫోటో ఆయన కాలి దగ్గర కనిపించిందని పోలీసులకు సిక్కు తలమెల్ కమిటీ ఛైర్మన్ హరిప్రీత్ సింగ్ ఫిర్యాదు చేశారు. అయితే, ఆ ఫొటో అసలైనదా? కాదా? అనేది దర్యాప్తులో తేలుస్తామని పోలీసు అధికారి నరేష్ కుమార్ దోగ్రా పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News