: శుభలేఖపై వధూవరుల వయస్సును పేర్కొనాల్సిందే
బాల్యవివాహాలకు చెక్ పెట్టేందుకు ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం ఒక పద్ధతిని అనుసరిస్తోంది. వధూవరుల వయనుసు వివాహ శుభలేఖలపై తప్పనిసరిగా ముద్రించాలని ఆదేశాలు జారీ చేసింది. దీన్ని పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు ఇప్పటికే హెచ్చరిక ప్రకటన జారీ చేశారు. అంతేకాదు, వెడ్డింగ్ కార్డ్స్ ను ప్రింట్ చేసే ముందు వధూవరుల వయసును ధ్రువీకరించుకోవాలని, ఆ తర్వాతే శుభలేఖలను అచ్చు వేయాలని ప్రింటింగ్ ప్రెస్ యజమానులకు కూడా ఆదేశాలు వెళ్లాయి.