: గుండె జబ్బులకు 'డాక్టర్ మీన'
'డాక్టర్ మీన' అనగానే ఎవరా అమ్మాయి.? ఎక్కడ ప్రాక్టీసు చేస్తోంది అని అడక్కండి. డాక్టర్ మీన అంటే చేప గారు అన్నమాట. మనం తీసుకునే ఆహారంలో నిర్దిష్ట మోతాదులో చేపగారికి చోటు కల్పిస్తే.. ఇక ప్రత్యేకంగా గుండెజబ్బులకోసం మరో డాక్టర్‌ను చూడాల్సిన అవసరం రాదని అంటున్నారు.... హార్వర్డ్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నిపుణులు.
డారియుష్ మెజాఫరియాన్ నగరంలో వారొక పరిశోధన నిర్వహించారు. 16 ఏళ్ల సుదీర్ఘ అబ్జర్వేషన్ తరువాత.. చేపలు తింటున్న వారికి హృద్రోగాలు తక్కువ అని తేల్చారు. వారానికి రెండుసార్లు చేపలు తినే అలవాటు ఉన్న వారిలో.. గుండెజబ్బులు దూరం జరగడమే కాదు.. ఆయుష్షు కూడా రెండేళ్లు పెరుగుతుందిట. చేపల్లోని ఒమేగా 3, డీహెచ్‌ఏ యాసిడ్, డీపీఏ అనే యాసిడ్ శరీరానికి ఈ మేలు చేస్తాయిట.