: ఎన్నికల ప్రధానాధికారికి చంద్రబాబు లేఖ
ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీని అరికడతామని ఎన్నికల సంఘం మాట ఇచ్చిందని, ఎన్నికల ప్రధానాధికారికి రాసిన లేఖలో టీడీపీ అధినేత చంద్రబాబు గుర్తు చేశారు. కానీ, వైసీపీ నేతలు పెద్దఎత్తున మద్యం, డబ్బు పంపిణీ చేస్తున్నారని ఆయన వివరించారు. వారు సరఫరా చేసే మద్యంలో ప్రమాదకర రసాయనాలను కలుపుతున్నారని, దానివల్ల ప్రజలు ఆసుపత్రి పాలవుతున్నారని తెలిపారు. ఓటర్ల మరణానికి కారణమైన వారిని అనర్హులుగా ప్రకటించాలని బాబు కోరారు. అంతేగాక డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్న పదిమంది వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరానన్నారు.